శనివారం 11 జూలై 2020
Andhrapradesh-news - May 19, 2020 , 22:42:32

అన్నార్తుల ఆకలి తీర్చేందుకు ప్రత్యేక భోజన కేంద్రాలు

అన్నార్తుల ఆకలి తీర్చేందుకు ప్రత్యేక భోజన కేంద్రాలు

విజయవాడ :  ఏపీ ప్రభుత్వం, అమృతహస్తం ఆపద్బాంధవ సంయుక్తాధ్వర్యంలో  అన్నార్తుల ఆకలి తీర్చేందుకు ప్రత్యేక భోజన కేంద్రాలను ఏర్పాటు చేశారు. విజయవాడ నగరం మీదుగా వెళ్ళే వలస కార్మికులకు కనకదుర్గమ్మ వారధి, బెంజ్ సర్కిల్,  రామవరప్పాడు  వద్ద ఏర్పాటు  చేసిన ఫుడ్ కౌంటర్ లను మంగళవారం దేవదాయ శాఖ మంత్రి ముఖ్యఅతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  వలస కార్మికులు జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారని, వారిని వారి స్వస్థలాలకు ప్రభుత్వమే పంపిస్తుందన్నారు. మనసున్న ముఖ్యమంత్రి కనుకనే వారికి అన్ని విధాలా సహకారం అందించాలని ఆదేశాలు ఇవ్వడంతో పాటు,  ముఖ్యమంత్రే స్వయంగా పర్యవేక్షిస్తున్నారని అయన చెప్పారు. ఎక్కడి నుంచి రాష్ట్రానికి వచ్చినా వాళ్ళకి వాళ్ల ప్రాంతాలకు పంపించేందుకు రైళ్లు, బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. logo