అక్కన్నపేట, ఏప్రిల్ 2 : కరోనా పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ మాలోతు లక్ష్మి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని అక్కన్నపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జడ్పీటీసీ భూక్య మంగతో కలిసి ఆమె కొవిడ్ టీకా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడారు. ప్రజలకు మరింత అందుబాటులోకి టీకా రావడం అభినందనీయమన్నారు. అక్కన్నపేట మండల కేంద్రంలోని దవాఖానలో కొవిడ్ టీకా అందుబాటులో ఉందని, నిబంధనల ప్రకారం వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ మురళీకృష్ణ, ఎంపీటీసీ పెసరు సాంబరాజు, రైతు సమన్వయ సమితి మండల కో-ఆర్డినేటర్ కందుల రాంరెడ్డి, మాజీ జడ్పీటీసీ మాలోతు బీలునాయక్ పాల్గొన్నారు.
కరోనా వ్యాపిస్తుంది జాగ్రత్త..
కరోనా రెండోదశ వేగంగా వ్యాపిస్తుందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తొగుట పీహెచ్సీ వైద్యుడు వెంకటేశ్ కోరారు. శుక్రవారం 50 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. తొగుటకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి కరోనా నిర్ధారణ అయినట్లు ఆయన తెలిపారు. 45 ఏండ్లకు పైబడిన వారందరికీ ఉచితంగా పీహెచ్సీలో కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నామన్నారు. శుక్రవారం 60 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చామన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, శానిటైజర్ వాడాలని, భౌతికదూరం పాటించాలన్నారు.
కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు..
కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తొగుట ఎస్సై సామ శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం తొగుటలో చౌరస్తా వద్ద ప్రజలకు కరోనా నిబంధనలపై అవగాహన కల్పించారు. కరోనా రెండో దశ ఉధృతమవుతున్న దృష్ట్యా ప్రజలు కరోనా బారిన పడకుండా అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు. మాస్కులు లేకుండా కొవిడ్- 19 నిబంధనలు పాటించని వారిపై విపత్తు నిర్వహణ చట్టంలోని 51-60 సెక్షన్లు, ఐపీసీ 188 ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలి
45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని కొమురవెల్లి పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ కార్తీక్ అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడారు. కొమురవెల్లి పీహెచ్సీలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందని 45 సంవత్సరాలు పైబడిన వాళ్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇవీ కూడా చదవండి..
14 అడుగుల గోడ మీది నుంచి పడేశారు.. అమెరికా, మెక్సికో సరిహద్దులో దారుణం
కోటిన్నర కరోనా వ్యాక్సిన్ డోసులు వృథా
‘కొవాగ్జిన్’కు బ్రెజిల్ నో..
వాటర్‌గేట్ కుంభకోణం సూత్రధారి మృతి