శనివారం 05 డిసెంబర్ 2020
Andhrapradesh-news - Oct 30, 2020 , 17:46:06

ఏపీలో కొత్తగా 2,886 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 2,886 కరోనా కేసులు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతోంది. 10 రోజులుగా 4వేలలోపే పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ ఆ రాష్ట్రంలో కొత్తగా 2,886 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 3,623 మంది కోలుకోగా తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా 17 మంది మృత్యువాతపడ్డారు. ఏపీలో ఇప్పటివరకు 8,20,565 మంది కరోనా బారిపడిన వీరిలో 7,88,375 మంది కోలుకున్నారు.

మరో 25,514 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ్టివరకు 6,676 మంది చనిపోయారు. 24 గంటల వ్యవధిలో  రాష్ట్రంలో 84,401 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. నేటివరకు 79.46 లక్షల మందికి పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.  ఇవాళ కృష్ణా జిల్లాలో ముగ్గురు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కడప, విశాఖ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి, ప్రకాశం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరు చొప్పున మృతి చెందారు. ఉభయగోదావరి జిల్లాల్లో కొత్తగా 400కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.