శుక్రవారం 30 అక్టోబర్ 2020
Andhrapradesh-news - Sep 24, 2020 , 19:14:54

చిత్తూర్‌ జిల్లాలో విషాదం.. ఏనుగు దాడిలో బాలిక మృతి

చిత్తూర్‌ జిల్లాలో విషాదం.. ఏనుగు దాడిలో బాలిక మృతి

చిత్తూరు : ఆంధ్రప్రదేశ్‌ చిత్తూర్‌ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏనుగు దాడిలో 17 ఏండ్ల బాలిక మృతి చెందింది. తమిళనాడు సరిహద్దు  హోసర్‌ పరిధిలోని కృష్ణగిరి అటవీ ప్రాంతం నుంచి ఏనుగు తప్పించుకుంది. బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో చిత్తూర్‌ జిల్లా సరిహద్దులోని మల్లమూరు గ్రామంలోకి ప్రవేశించింది. ఏనుగును చూసేందుకు సోనియా(17) అనే బాలిక తల్లిదండ్రులతో కలిసి బయటకు రాగా ఆమెపై దాడి చేసింది. దీంతో బాలిక ఘటనా స్థలంలోనే మృతి చెందగా హఠాత్‌ పరిణామంతో ఆమె తల్లి స్పృహకోల్పోయింది. బాధితురాలిని చికిత్స నిమిత్తం కుప్పంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బాలిక తండ్రి ఏనుగు దాడి నుంచి తృటిలో తప్పించుకున్నాడు. డీఎఫ్‌ఓ రవిశంకర్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుప్పం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.