శుక్రవారం 10 జూలై 2020
Andhrapradesh-news - Jun 02, 2020 , 11:47:47

ఏపీలో మరో 115 కరోనా కేసులు నమోదు

ఏపీలో  మరో 115 కరోనా కేసులు నమోదు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. గడచిన 24 గంటల్లో 12,613 నమూనాలు పరీక్షించగా 115 మందికి వైరస్‌ సోకినట్లు  నిర్ధారణ అయింది.  కొత్తగా నమోదైన వాటిలో ఇతర రాష్ట్రాలకు చెందినవారు 33 మంది ఉన్నారు. రాష్ట్రంలో స్థానికంగా ఉంటున్న 82 మందికి పాజిటివ్‌గా తేలింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం 3,791 కేసులు నమోదయ్యాయి. కరోనా వల్ల మృతిచెందిన వారిసంఖ్య 64కు చేరింది.  కరోనా నుంచి కోలుకొని 2,209 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 927 మంది చికిత్స పొందుతున్నారు. 


logo