శనివారం 06 మార్చి 2021
Andhrapradesh-news - Jan 27, 2021 , 18:04:37

ఏపీలో కొత్తగా 111 మందికి కరోనా

ఏపీలో కొత్తగా 111 మందికి కరోనా

అమరావతి : గడిచిన 24 గంటల వ్యవధిలో ఆంధ్రప్రదే‌శ్‌లో కొత్తగా 111 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో  97మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,87,349 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 8,78,828 మంది చికిత్సకు కోలుకున్నారు.

మరో 1369 మంది దవాఖాన, హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఇవాళ్టివరకు 7152 మంది మృత్యువాతపడ్డారని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 33,808 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 1, 29,75,961 శాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడించారు. 

VIDEOS

logo