మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Andhrapradesh-news - Aug 09, 2020 , 21:53:36

ఏపీలో కొత్తగా 10,820 కరోనా‌ కేసులు

ఏపీలో కొత్తగా 10,820 కరోనా‌ కేసులు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గత మూడు రోజులుగా పదివేలకు పైనే కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 10,820 కరోనా కేసులు నమోదయ్యాయి. 62,912 మంది శాంపిల్స్‌ పరీక్షించగా వీటిలో 10,820 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. కోవిడ్‌-19తో తాజాగా 97 మంది మరణించారు. కరోనా నుంచి 9,097 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. జిల్లాల వారీగా కోవిడ్‌ మరణాలు ఈ విధంగా ఉన్నాయి. గుంటూరులో 12 మంది, ప్రకాశం-11, చిత్తూరు-10, పశ్చిమ గోదావరి-10, అనంతపురం-8, కడప-8, శ్రీకాకుళం-8, కర్నూలు-7, తూర్పు గోదావరి-6, విశాఖపట్నం-6, కృష్ణ-4, నెల్లూరు-4, విజయనగరంలో ముగ్గురు చొప్పున మృత్యువాతపడ్డారు. 



logo