అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో 108 సేవలకు శనివారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 5 గంటల వరకు బ్రేక్ పడనుంది. సాంకేతిక కారణాల కారణంగా నాలుగు గంటపాటు 108 నంబర్ అందుబాటులో ఉందని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ తెలిపింది. 108 నంబర్‌కు ప్రత్యామ్నాయంగా 08645 660208, 8331033405 నంబర్లు అందుబాటులో ఉండనున్నాయి. 108 సేవలను వినియోగించుకోదలిచిన వారు ఈ రెండు నంబర్లకు కాల్ చేయాలని అధికారులు సూచించారు.