శుక్రవారం 07 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 08, 2020 , 13:42:41

ఏపీలో కొత్తగా 1062 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 1062 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1062 కరోనా కేసులు నమోదవగా, మరో 12 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 22,259కు చేరింది. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో 10,894 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, మరో 11,101 మంది బాధితులు కోలుకున్నారు. ఈ వైరస్‌ వల్ల రాష్ట్రంలో మొత్తం 264 మంది మరణించారని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.     

ఈరోజు నమోదైన కేసుల్లో ఏపీకి చెందినవారు 1051 మంది ఉండగా, ఇతర రాష్ర్టాల నుంచి ఏపీకి వెళ్లిన 9 మంది, విదేశాల నుంచి ఏపీకి వెళ్లిన మరో ఇద్దరు ఉన్నారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 27,643 మందికి కరోనా పరీక్షలు చేయగా, ఇప్పటివరకు మొత్తం 10,77,733 నమూనాలను పరీక్షించారు.


logo