బుధవారం 30 సెప్టెంబర్ 2020
Andhrapradesh-news - Aug 05, 2020 , 21:28:09

ఏపీలో తాజాగా 10,128 కరోనా పాజిటివ్‌ కేసులు

ఏపీలో తాజాగా 10,128 కరోనా పాజిటివ్‌ కేసులు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా విజృంభన రోజు రోజుకి విస్తరిస్తుంది. ఒకే రోజు 10,128 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 60,576 శాంపిల్స్‌ను పరీక్షించగా వీటిలో 10,128 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. కోవిడ్‌-19 కారణంగా తాజాగా 77 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని 8,729 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,86,461 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 80,426. 

జిల్లాల వారీగా కరోనా మృతుల వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 16 మంది, విశాఖపట్నం-12, శ్రీకాకుళం-10, చిత్తూరు-8, తూర్పు గోదావరి-7, కృష్ణ-5, నెల్లూరు-4, కర్నూలు-3, విజయనగరం-3, పశ్చిమ గోదావరి-3, అనంతపురం-2, కడప-2, ప్రకాశంలో ఇద్దరు చొప్పున మరణించారు. logo