బుధవారం 20 జనవరి 2021
Andhrapradesh-news - Nov 02, 2020 , 18:15:37

ఏపీలో కొత్తగా 1,916 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 1,916 కరోనా కేసులు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. గత పదిరోజులుగా 3వేల లోపే పాజిటివ్‌ కేసులు నమోదువుతున్నాయి. గడిచిన  24 గంటల్లో ఆ రాష్ట్రంలో కొత్తగా 1,916 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 3,033 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్‌ తీవ్రత కారణంగా 13 మంది మృతి చెందారు.

ఏపీలో ఇప్పటివరకు 8,27,882 మంది కొవిడ్‌-19 వైరస్‌ బారినపడగా 7,98,625 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తీవ్ర ఇన్‌ఫెక్షన్ల కారణంగా 6,719 మంది మృత్యువాతపడ్డారని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 64,581 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 81,82,266 మందికి పరీక్షలు పూర్తిచేశామని అధికారులు వెల్లడించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo