కేటీఆర్‌లా.. లోకేశ్‌ గొప్ప ఐటీ కంపెనీలు తేలేదు!

Mon,March 25, 2019 02:28 PM

YS Sharmila holds Press Meet slams Nara Lokesh , CM Chandrababu

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి అని వైసీపీ నాయకురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. రాష్ట్రంలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించడం లేదు. చంద్రబాబు హయాంలో గొప్పలు తప్ప రాష్ర్టాభివృద్ధి జరగలేదని విమర్శించారు. అమరావతిలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో షర్మిల మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికార టీడీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

2014లో గెలిస్తే మొదటి సంతకం రుణమాఫీ ఫైలుపై పెడతామని చంద్రబాబు ప్రజలను మోసం చేశారు. మహిళలకు రుణమాఫీ చేసే ఉద్దేశం లేదని మంత్రి పరిటాల సునీత చెప్పారు. అ ఆ లు కూడా రానివాడికి అగ్రతాంబూలం అన్నట్టు లోకేష్‌ తీరు ఉంది. కేటీఆర్‌లా లోకేశ్‌ గొప్ప ఐటీ కంపెనీలు తేలేదు. ఈ ఎన్నికలు కేసీఆర్‌, చంద్రబాబు మధ్య పోటీ ఎలా అవుతాయి. ఈ రాజకీయ సినిమాలో పవన్‌ యాక్టర్‌, చంద్రబాబు డైరెక్టర్‌. చంద్రబాబు చెప్పిందే పవన్‌ కల్యాణ్‌ చేస్తున్నాడు. డేటా చోరీపై పవన్‌ ఎందుకు మాట్లాడలేదు. పవన్‌ నామినేషన్‌కు టీడీపీ క్యాడర్‌ వెళ్తుంది. పవన్‌కు ఓటేస్తే చంద్రబాబుకు ఓటేసినట్లే. చంద్రబాబుకు జగన్‌మోహన్‌రెడ్డికి మధ్య ఎంత తేడా ఉందో ఆలోచించండి. 9 ఏళ్లుగా జగనన్న విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నారు. పదవుల కన్నా విశ్వసనీయతే ముఖ్యమని జగన్‌ అనుకున్నారు. 9ఏళ్లు ప్రజల కోసం పోరాడిన జగన్‌కు ఒక్కసారి అవకాశం ఇవ్వండి.అని షర్మిల కోరారు.

4958
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles