సీఏం జగన్‌కు సర్వమత పెద్దల ఆశీస్సులు

Thu,May 30, 2019 01:02 PM

YS Jagan participated all faith prayer meet

అమరావతి: నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను సర్వమత పెద్దలు ఆశీర్వదించారు. జగన్‌ పాలనలో ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని దీవించారు. సగన్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం సభావేధికపై హిందూ, ముస్లీం, క్రైస్తవ మత పెద్దలు ప్రార్థనలు చేశారు. ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తరువాత జగన్ రాష్ట్రంలో ఆధ్యాత్మిక యాత్రను చేసిన విషయం తెలిసిందే.

తిరుమల వేంకటేశ్వరస్వామి, బెజవాడ కనగదుర్గ అమ్మవారు, కడప దర్గా, పులివెందుల సీఎస్‌ఐ చర్చిల్లో జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేటి ప్రమాణ స్వీకారానికి మత పెద్దలు హాజరై ఆశీర్వదించారు. జగన్ ఒక్కరూ మాత్రమే నేడు ప్రమాణ స్వీకారం చేశారు. దైవసాక్షిగా పేర్కొంటూ తెలుగులో ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం సమయంలో జనసమూహం జగన్ పేరును పదే పదే ఉచ్చరించారు.

812
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles