సారు పాదం మోపితే..

Tue,November 12, 2019 04:59 PM

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ట్విటర్లో బాబును ఉద్దేశించి సెటైర్లు వేశారు. ''తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయి చెల్లని కాసు అయిపోయాడు. లేదంటే ముంబయిలో తిష్ట వేసి నాలుగు భిన్నపక్షాలను ఏకం చేసి మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తా అని చిటికెలేసేవాడు. సారు పాదం మోపితే శని దేవత జిడ్డులా పట్టుకుంటుందని తెలిసిపోవడంతో ఫోన్లు కూడా ఎత్తడం లేదంట ఎవరూ. ప్రతిపక్ష నాయకుడిగా నిర్మాణాత్మక పాత్ర పోషించి హుందాగా ఉండాల్సింది పోయి అసూయ, అహంకార ప్రవర్తనతో పాతాళంలోకి జారిపోయాడు చంద్రబాబు. అపోజిషన్ లీడర్ గా రాణించాల్సిన వాడు కుప్పం ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు. పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దింపి చేతకాని తనాన్ని బయట పెట్టుకున్నాడని'' విజయ సాయిరెడ్డి మండిపడ్డారు.

1362
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles