ఓటేసిన వై.యస్.జగన్, చంద్రబాబు నాయుడు

Thu,April 11, 2019 09:27 AM

Y.S. Jagan and Chandrababu naidu cast their vote

అమరావాతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమై కొనసాగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.యస్. జగన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కడప జిల్లా పులివెందులలో తన భార్య భారతితో కలిసి ఆయన ఓటేశారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. ప్రజలు మార్పు కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఎటువంటి భయం లేకుండా అందరూ ఓటింగ్‌లో పాల్గొనాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు.


టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ఉండవల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. భార్య భువనేశ్వరి, కొడుకు లోకేష్, కోడలు బ్రాహ్మణిలతో కలిసి చంద్రబాబు ఓటేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో చాలా చోట్ల ఈవీఎంలు మోరాయించాయి. ఈవీఎంల ఇబ్బందుల వల్లే బ్యాలెట్ ఓటింగ్ డిమాండ్ చేస్తున్నాం. కానీ ఎన్నికల సంఘం లేనిపోని సాకులు చెబుతుందని పేర్కొన్నారు.

1240
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles