ఎన్నికల్లో టీడీపీ అరాచకాలపై ఈసీకి ఫిర్యాదు..

Mon,April 15, 2019 06:27 PM

We Complaints to EC On TDP law and order Problem


న్యూఢిల్లీ : ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చేసిన అరాచకాలపై ఈసీకి ఫిర్యాదుచేశామని వైసీపీ నేత విజయసాయి రెడ్డి తెలిపారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..గుంటూరులో శాంతిభద్రతల ఉల్లంఘన..స్వయంగా స్పీకరే ఉద్రిక్తతలు సృష్టించడాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లామన్నారు.

కోడెలపై తాము ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదని, ఫిర్యాదు చేస్తే తిరిగి తమ పార్టీ నేతలపై కేసులు నమోదు చేశారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. మచిలీ పట్నంలో ఈవీఎం స్ర్టాంగ్ రూమ్ లోపలి దృశ్యాలు బయటకొచ్చాయి. ఈ నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ ల వద్ద మరిన్ని కేంద్ర బలగాల భద్రత పెంచాలని ఈసీని కోరినట్లు పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో నారాయణ, చైతన్య సంస్థల సిబ్బంది ఉన్నారు. విజయనగరం, గుంటూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో శాంతి భద్రతల ఉల్లంఘన జరిగిందన్నారు. రాష్ట్రానికి అదనపు బలగాలను కేటాయించాలని కోరినట్లు చెప్పారు.ఆర్టీసీ కార్మికులకు, ఆశావర్కర్లకు పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించాలని ఈసీని కోరినట్లు చెప్పారు.

830
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles