పార్టనర్లూ..ఇక తనివితీరా ఏడవండి..!

Wed,November 20, 2019 12:28 PM

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయ సాయిరెడ్డి వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ట్విటర్లో బాబును ఉద్దేశించి విమర్శలు చేశారు. ''మాజీ రౌడీ షీటర్, తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసిన దుశ్శాసనుడు చింతమనేని ప్రభాకర్‌ను ప్రజలంతా ఆదర్శంగా తీసుకోవాలట. మీ బంధువైతే ఇంటికి పిలిచి మర్యాదలు చేయండి చంద్రబాబు. ప్రజాకంటకుడిని సమర్థించడమంటే ప్రజల్ని అవమానించడమే. పోలీసులకు పచ్చ యూనిఫామ్ వేసిన చరిత్ర మీదే. మద్య నిషేధంపై అక్కా చెల్లెమ్మలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. బార్ల సంఖ్యను 40 శాతానికి పరిమితం చేయాలని ఆదేశించారు. బెల్టుషాపులు ఎగిరిపోయాయి. మద్యం విక్రయాల సమయం తగ్గింది. ఇక తనివితీరా ఏడవండి పార్టనర్లూ..'' అంటూ విజయ సాయిరెడ్డి చురకలంటించారు.


ప్రస్తుతం ఉన్న బార్ల సంఖ్యను 40 శాతానికి తగ్గించాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం అమరావతిలో బార్ల పాలసీపై ఎక్సైజ్‌ అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. స్టార్‌ హోటళ్లు మినహా ఏపీలో ప్రస్తుతం ఉన్న 798 బార్లను 40 శాతానికి తగ్గించనున్నారు.

2262
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles