పేర్లు సరిగా పలకడమే రాని మాలోకం

Sat,November 9, 2019 12:43 PM

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌పై వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ట్విటర్లో చంద్రబాబుపై విమర్శలు చేశారు. 'పేద పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదివితే ఇక తెలుగు పేపర్లు ఎవరు కొని చదువుతారు అన్నది పచ్చ మీడియా ఆందోళన కాబోలు. బాబు అవినీతిని కప్పిపుచ్చి పాఠకుల మెదళ్లలోకి స్లో పాయిజన్ ఎక్కించే అవకాశం ఉండదని ఏడుపు. వీళ్ల కుటుంబాల్లోని పిల్లలు తెలుగు మాట్లాడటానికే ఇష్టపడరు. సచివాలయం, మంగళగిరి, గుంటూరు అనే పేర్లు సరిగా పలకడమే రాని మాలోకం తెలుగు ఉద్యమకారుడిలా మాట్లాడుతున్నాడు. మా పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుతారు. బడుగు బలహీన వర్గాల వారికి ఆ చదువులెందుకు అంటున్నాడు. వాళ్లు గ్రామాలు దాటి బయటకు రావద్దన్నది టిడిపి దుర్మార్గ కోరికని' విజయ సాయిరెడ్డి మండిపడ్డారు.

1502
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles