తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి, తమిళ సీఎం

Tue,September 25, 2018 08:02 AM

venkaiah naidu and Palaniswami visits Tirumala

తిరుమల: తిరుమల శ్రీవారిని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తమిళనాడు సీఎం పళనిస్వామి ఈ తెల్లవారుజామున దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వీరికి స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 29 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. వేంకటేశ్వరుడి సాధారణ సర్వదర్శనానికి 20 గంటలు, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. స్వామివారిని నిన్న 81,677 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,328 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 3.20 కోట్లుగా ఉంది.

1303
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles