ఇన్సూరెన్స్ సొమ్ము కోసం పనిమనిషిని చంపించిన యజమాని

Sun,August 25, 2019 02:24 PM

The Owner who killed his maid for insurance money

అమరావతి: ఇన్సూరెన్స్ సొమ్ము కోసం యజమాని.. పనిమనిషిని చంపించాడు. ఈ దారుణ సంఘటన ఏపీలోని కర్నూలులో చోటుచేసుకుంది. నాలుగేళ్ల క్రితం కర్నూలు జిల్లా అవుకు వద్ద జరిగిన వ్యక్తి హత్య కేసులో దాగివున్న సంచలన నిజాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 2015లో బనగానపల్లె అవుకు వద్ద వడ్డే సుబ్బరాయుడు అనే వ్యక్తి మృతిచెందాడు. తన వద్ద పనిచేసే సుబ్బారాయుడిని చంపించి యాక్సిడెంట్‌గా చిత్రీకరించాడు యజమాని భాస్కర్‌రెడ్డి. రోడ్డు ప్రమాదంగా భావించి పోలీసులు అలాగే కేసు నమోదు చేశారు. కాగా నాలుగేళ్ల తర్వాత సుబ్బారాయుడి హత్యపై పోలీసులకు కీలక సమాచారం అందింది. యజమాని భాస్కర్‌రెడ్డి హత్య చేయించినట్లు గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులకు తెలిపారు. నా అనే వాళ్లు లేని పనిమనిషి సుబ్బారాయుడిపై భాస్కర్‌రెడ్డి రూ. 32 లక్షల ఇన్సూరెన్స్ చేశాడు. సుబ్బారాయుడి మరణంతో నకిలీ ధ్రువపత్రాలతో బీమా సొమ్మును కాజేశాడు. బీమా డబ్బును నిందితులు పంచుకున్నారు. దీంతో నాలుగేళ్ల నాటి కేసును తిరగదోడి పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. సమర్థంగా కేసును ఛేదించిన కర్నూలు పోలీసులకు అధికారులు ప్రశంసలు తెలిపారు.

635
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles