తిరుమల‌లో ఘనంగా రథసప్తమి వేడుకలు

Tue,February 12, 2019 12:32 PM

తిరుమలలో రథసప్తమి వేడుకలు ఆంగరంగ వైభవంగా ప్రారంభంమయ్యాయి. ఈ వేడుకలలో భాగంగా శ్రీవారి సుర్యప్రభ వాహన సేవ వైభవోపేతంగా సాగింది. ఉదయం 5.30 గంటలకే మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించి మాడ వీధులలో ఊరేగుతు భక్తులకు దర్శనమిచ్చారు. తేజోవిరాజితుడైన శ్రీనివాసుడు బంగారు సూర్యప్రభవాహనంపై తిరువీధులలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. సూర్యుడు తేజోనిధి... ప్రకృతికి చైతన్య ప్రదాత... సూర్యప్రభపైన శ్రీనివాసుని దర్శనం భక్తులకు పూర్ణఫలాన్ని ఇస్తుంది. ఆరోగ్యం, ఐశ్వర్యం.. ఈ వాహన సేవ దర్శనం వల్ల పరిపూర్ణంగా లభిస్తుందని భక్తుల విశ్వాసం. దీంతో భారీ సంఖ్యలో భక్తులు సూర్యప్రభవాహన సేవలో ఫాల్గొని స్వామి వారికి కర్పూర నిరాజనాలు సమర్పించారు.

అనంతరం మలయ్యప్పస్వామి చిన్నశేషవాహనంపై ఊరేగుతు భక్తులకు దర్శనమిచ్చారు. ఐదు తలలుండే చిన్న శేషవాహనంపై స్వామి వారు మాడా వీధలలో విహరిస్తు భక్తులకు అభయప్రదానమిచ్చారు. పెద్దశేషవాహనం ఆదిశేషుడికి ప్రతీకగా భావిస్తే.. చిన్నశేషవాహనాన్ని వాసుకిగా పరిగణిస్తారు. చిన్న శేషవాహనం పై ఊరేగే స్వామిని భక్తితో ద్యానిస్తే కుండలినీ యోగ సిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం. బంగారు శేషవాహనంపై శ్రీవారి వాహనయాత్ర శోభాయమానంగా సాగింది. విశేష.. ఆభరణాలు.. అలంకారాలతో తిరువీధులలో విహరించిన మలయప్పను...భక్తులు తన్మయత్వంతో తిలకించారు.

స్వామి వారి వాహన సేవలలోనే అత్యంత ప్రధానమైన గరుడవాహనంపై అధిరోహించిన మలయప్పస్వామి నాలుగు మాడా వీధులలో ఊరేగుతు భక్తులకు దర్శనమిస్తున్నారు. వజ్రవైడూర్యాల ధగధగలతో శ్రీనివాసుడు తిరువీధులలో దేదీప్యమానంగా వెలుగొందారు. స్వామి వారికి ప్రధాన వాహనం గరుడుడు. అందుకే గరుడిని ప్రథమ భక్తుడని కూడా అంటారు. గరుడ వాహనంపై ఊరేగే స్వామి దర్శనం ఎంతో మంగళకరం, శుభప్రదం.. ఆశేష సంఖ్యలో హాజరైన భక్తుల గోవిందనామస్మరణల మధ్య శ్రీవారి గరుడవాహన సేవ వైభవోపేతంగా సాగింది.

1037
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles