ఏపీలో ముగిసిన పోలింగ్.. 5 గంటల వరకు 75 శాతం నమోదు

Thu,April 11, 2019 06:51 PM

polling completed for parliament and assembly elections in andhra pradesh

అమరావతి: ఏపీలో పోలింగ్ సమయం ముగిసింది. అయితే.. పోలింగ్ సమయం ముగిసినప్పటికీ.. పోలింగ్ కేంద్రాల వద్ద ఇంకా ఓటర్లు బారులు తీరారు. క్యూలైన్లలో వేచి ఉన్నారు. గడుపు లోపు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లందరికీ ఎన్నికల అధికారులు టోకెన్లు ఇచ్చారు. వాళ్లందరికీ ఓటేసే అవకాశం కల్పిస్తామని అధికారులు తెలిపారు.

ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైనప్పటికీ.. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం, అధికార పార్టీల నేతలు పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణలకు దిగడం లాంటి వాటి వల్ల పోలింగ్‌కు ఆలస్యమైంది. మండే ఎండను కూడా లెక్కచేయకుండా ఏపీ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారు.

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. కురుపాం, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు ఏపీలో నమోదైన పోలింగ్ 75 శాతంగా ఉంది.

జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి..


శ్రీకాకుళం - 62.12 %
విజయనగరం - 71.11 %
విశాఖపట్నం - 50 %
తూర్పుగోదావరి - 67.34 %
పశ్చిమగోదావరి - 66.67 %
కృష్ణా - 63.23 %
గుంటూరు - 64.46 %
ప్రకాశం - 66.65 %
నెల్లూరు - 67.23 %
కడప - 63.21 %
కర్నూలు - 58.12 %
అనంతపురం - 67.64 %
చిత్తూరు - 64.23 %

3217
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles