టీడీపీకి పవన్ ఝలక్!

Wed,January 6, 2016 01:11 PM

-గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం అనుమానమే
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో జనసేన నేత పవన్‌కల్యాణ్ ప్రచారం చేస్తారని ప్రకటించిన టీటీడీపీ నేతలకు ఆయన ఝలక్ ఇచ్చారు. మంగళవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఈ విషయం ప్రకటించిన టీడీపీ నేతలు.. పవన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. కానీ ఆయన ప్రచారం చేసే విషయమై ఎటువంటి హామీ ఇవ్వలేదని తెలిసింది. దీనిపై చంద్రబాబుతో మరోసారి ప్రయత్నించాలని వారు అభిప్రాయ పడినట్లు సమాచారం.


జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 9న నిజాం కళాశాల గ్రౌండ్స్‌లో సభ నిర్వహిస్తున్నట్లు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, గ్రేటర్ హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్‌గౌడ్ మీడియాకు చెప్పారు. పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు కూడా పాల్గొంటారన్నారు. కాగా, బీజేపీతో సీట్ల సర్దుబాటు బాధ్యతలను కేంద్రమంత్రి సుజనాచౌదరి, సీనియర్ నేతలు ఎల్ రమణ, రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావులకు అప్పగిస్తూ టీడీపీ నిర్ణయం తీసుకున్నది.

4179
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles