టీడీపీ అభ్యర్థి కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి..

Thu,May 23, 2019 03:53 PM

Nota gets more votes than tdp candidate in araku

అమరావతి: ఏపీలో వైఎస్సార్సీపీ విజయం ఖాయమైపోయింది. టీడీపీకి చెందిన ప్రముఖులు కూడా ఓటమి బాట పడుతున్నారు. మరోవైపు విశాఖ జిల్లా అరుకు స్థానంలో టీడీపీ తరుపున పోటీ చేసిన మాజీ మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ కంటే నోటాకే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన కిడారి సర్వేశ్వరరావు కొడుకుకు చంద్రబాబు అప్పుడు మంత్రి పదవి ఇచ్చారు. తర్వాత అదే నియోజకవర్గం నుంచి అతడిని నిలబెట్టారు. కానీ.. అరుకులో తండ్రి సెంటిమెంట్ ఏమాత్రం పనిచేయలేదు. ఫ్యాన్ గాలికి సైకిల్ కొట్టుకుపోయింది. నోటాకు వచ్చిన ఓట్లు కూడా టీడీపీ అభ్యర్థికి రాలేదు.

7291
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles