చంద్రబాబు నాయుడుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

Fri,September 14, 2018 10:09 AM

Non bailable warrant against Chandrababu Naidu

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. 2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు వెళ్లిన చంద్రబాబుతో పాటు 14 మందిపై అప్పటి మహారాష్ర్ట ప్రభుత్వం కేసు నమోదు చేసింది. కేసు విచారణకు హాజరుకావాల్సిందిగా ధర్మాబాద్ కోర్టు ఇప్పటికే పలుమార్లు నోటీసులు పంపించింది. అయినా స్పందన లేకపోవడంతో ఈ నెల 21న చంద్రబాబుతో పాటు మిగతా 14 మందిని కోర్టులో హాజరు పరచాలని ఆదేశిస్తూ న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీచేసింది. చంద్రబాబు నాయుడు ఈ ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

6194
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles