ముగిసిన జాతీయ మహిళా పార్లమెంటేరియన్ సదస్సు

Sun,February 12, 2017 07:03 PM

National Women's Parliament session end

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి వేదికగా గత మూడు రోజులుగా జరిగిన జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల సదస్సు నేడు ముగిసింది. సదస్సు ముగింపు సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. మహిళా పార్లమెంటేరియన్ సదస్సుకు మంచి స్పందన వచ్చిందన్నారు. సోషల్ మీడియాలోనూ సదస్సుకు మద్దతు లభించిందన్నారు. అంతా కలిసి ఈ సదస్సును విజయవంతం చేశారని కొనియాడారు.

తల్లికి వందనం పేరుతో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఏపీలోని అన్ని స్కూళ్లలో, కాలేజీల్లో దీన్ని అమలు చేస్తామన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఈ సదస్సు ఏకగ్రీవంగా తీర్మానం చేసిందని తెలిపారు. సదస్సులో చర్చించిన అన్ని అంశాలను అమలు చేస్తామన్నారు. మహిళలకు గౌరవం ఇచ్చినప్పుడే ప్రపంచం అభివృద్ధి చెందుతుందన్నారు. మహిళలకు సమాన అవకాశాలు వచ్చే వరకు అండగా ఉంటామన్నారు. అభివృద్ధిలో మహిళలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

781
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS