ముద్ర యాడ్స్ వ్యవస్థాపక చైర్మన్ కన్నుమూత

Fri,February 5, 2016 01:41 PM

Mudra Founder AG Krishnamurthy Passes Away

హైదరాబాద్ : ముద్ర యాడ్స్ వ్యవస్థాపక చైర్మన్ అచ్యుతని గోపాల కృష్ణమూర్తి శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 1942 ఏప్రిల్ 28న గుంటూరు జిల్లా వినుకొండలో కృష్ణమూర్తి జన్మించారు. క్యాలికో టెక్స్‌టైల్స్ మిల్లులో చిరుద్యోగంతో కృష్ణమూర్తి ప్రస్థానం ప్రారంభమైంది. 1972లో శిల్పి అడ్వర్‌టైజింగ్‌లో అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్‌గా కృష్ణమూర్తి పని చేశారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేశారు.

1976లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో అడ్వర్‌టైజింగ్ మేనేజర్‌గా ఏజీకే బాధ్యతలు స్వీకరించారు. 1980 మార్చి 25న ముద్ర కమ్యూనికేషన్స్ యాడ్ ఏజెన్సీని ఏజీకే ప్రారంభించారు. విమల్, రస్నా వంటి ప్రముఖ ప్రకటనలకు కృష్ణమూర్తినే రూపకర్త. ధీరూబాయ్ అంబానీ జీవనశైలిపై కృష్ణమూర్తి అనేక రచనలు చేశారు.

1709
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles