రోడ్డుప్రమాదంలో తల్లీకుమారుడు మృతి

Fri,February 8, 2019 09:39 AM

mother and son dies in road accident in guntur dist

అమరావతి : గుంటూరు శివారు బుడంపాడు సమీపంలో ఇవాళ తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం.. ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి యాదమ్మ(32), కుమారుడు చరణ్(10) మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను నల్లగొండ జిల్లా నకిరేకల్ వాసులుగా పోలీసులు గుర్తించారు. రహదారి పక్కన ట్రాక్టర్ కింద ముగ్గురు నిద్రిస్తుండగా.. వేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం.. ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.

971
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles