నా మతం మానవత్వం.. నా కులం మాట నిలబెట్టుకోవడం

Mon,December 2, 2019 05:34 PM

గుంటూరు: 'నా మతం మానవత్వం.. నా కులం మాట నిలబెట్టుకోవడమే అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. తన కులం, మతంపై ప్రతిపక్షాలు పదేపదే ప్రస్తావిస్తున్నాయని ఆయన అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నామని సీఎం చెప్పారు. ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తున్నట్లు వివరించారు. ఆపరేషన్‌ చేయించుకున్న తర్వాత విశ్రాంతి సమయంలో పేషెంట్ కోలుకునే వరకు ఆర్థిక సాయం చేస్తామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వైఎస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా కార్యక్రమాన్ని జగన్‌ మోహన్‌ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా పేషెంట్లకు ఆర్థికసాయం చెక్కులను సీఎం అందజేశారు.


గుంటూరు ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ..'ఆపరేషన్‌ చేయించుకొని విశ్రాంతి తీసుకునే పరిస్థితిలో ఆ రోగులు ఇంట్లో పస్తులుండే పరిస్థితి రాకుండా ఉండేందుకు రోజుకు రూ.225 చొప్పున నెలకు రూ.5 వేలకు వరకు ఎన్ని రోజులైనా, నెలలైనా డాక్టర్లు సిఫార్సును ఈ పథకానికి వర్తిస్తూ అమలు చేస్తున్నాం. వైఎస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా అనే పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నాం. జనవరి 1వ తేదీ నుంచి కొత్త హెల్త్‌ రికార్డులతో కూడిన హెల్త్‌ కార్డులు పంపిణీ చేస్తాం. డయాలసిస్‌ రోగులకు రూ.10 వేల పింఛన్‌ ఇస్తున్నాం. జనవరి 1 నుంచి తలసీమియా, సికిల్‌సెల్‌ వ్యాధిగ్రస్తులకు కూడా పింఛన్‌ ఇస్తాం. 104, 108 నంబర్లకు ఫోన్‌ కొడితే అంబులెన్స్‌లు వచ్చే పరిస్థితి గతంలో లేదు. ఇలాంటి పరిస్థితిని మార్చుతూ అక్షరాల 1060 అంబులెన్స్‌లు కొనుగోలు చేస్తూ ఏప్రిల్‌ నాటికి 104, 108 వాహనాలు 20 నిమిషాల్లో మీ వద్దకు వచ్చి మంచి ఆస్పత్రికి చేర్పించే కార్యక్రమం జరుగుతుంది. ఆపరేషన్‌ చేయించుకుని ఇంటికి వెళ్లే సమయంలోనే విశ్రాంతి డబ్బులు కూడా ఇచ్చి పంపిస్తామని' జగన్‌ వివరించారు.

907
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles