బోటు ప్రమాదం.. మూడో రోజు గాలింపు

Tue,September 17, 2019 08:06 AM

తూర్పు గోదావరి : పాపికొండల టూర్ బోటు ప్రమాదంలో గల్లంతైన వారి కోసం మూడో రోజు గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి. గోదావరిలో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటు అగ్నిమాపక దళం, గజ ఈతగాళ్లు మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ఇప్పటి వరకు 8 మృతదేహాలు లభ్యమయ్యాయి. ధవళేశ్వరం ఆనకట్ట 17వ గేటు వద్దకు ఓ మృతదేహం కొట్టుకువచ్చింది. కచ్చులూరు వద్ద ఒక మృతదేహాన్ని గుర్తించారు. ఈ మృతదేహాన్ని దేవీపట్నం పోలీసు స్టేషన్‌కు బృందాలు తరలించాయి. ఎగువ కాఫర్ డ్యామ్ వద్దకు మరో మృతదేహం కొట్టుకువచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ఇసుక రేవు వద్ద మరో మృతదేహాన్ని బృందాలు గుర్తించాయి. బోటు మునిగిన ప్రాంతంలో సుడిగుండాలు ఏర్పడుతుండడంతో గాలింపు చర్యలకు తీవ్ర ప్రతికూలం ఏర్పడుతోంది. సుడిగుండాలు, వరద ఉధృతితో సహాయక బోట్లు నిలవని పరిస్థితి ఏర్పడింది.

1081
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles