అమరావతిలో గ్లోబల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్

Fri,February 10, 2017 07:45 PM

global music and dance festival start in Amaravati

కృష్ణా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కేంద్రంగా గ్లోబల్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్ కార్యక్రమం ప్రారంభమైంది. ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకే రోజు రెండు పండగ(జాతీయ మహిళా పార్లమెంటేరియన్ సదస్సు)లను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సంగీతం, సంస్కృతి, కళలకు గ్లోబల్ హబ్‌గా అమరావతిని తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకను ప్రతీ ఏడాది నిర్వహించే యోచన చేస్తున్నట్లు చెప్పారు.

ఇండియన్ క్లాసికల్, వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్, బాలీవుడ్, గ్లోబల్ ఫ్యూజన్, ఫోక్ మ్యూజిక్, సమకాలీన ప్రపంచ సంగీతం విభాగాల్లో ప్రదర్శనలు జరగనున్నాయి. సుబ్రమణియం, బిర్జూ మహారాజ్, హేమమాలిని, కవితా కృష్ణమూర్తి, అజీజ్, అనూప్, సురేశ్ వాడ్కర్, త్రిలోక్ తదితర ప్రముఖులు ఈ వేడుకలో తమ ప్రదర్శనలు ఇవ్వనున్నారు.ఆధ్యాత్మిక భావనలో కృష్ణానది పుట్టుక.. కనకదుర్గ అవతార ప్రాశస్త్యం:
చతుర్ముఖ బ్రహ్మ సరస్వతి దేవీతో కలిసి యజ్ఞం చేయసంకల్పిస్తాడు. యజ్ఞ సమయానికి సరస్వతి దేవీ రావడం ఆలస్యం అయింది. మూహుర్తం సమీపిస్తుండటంతో గాయత్రి దేవీతో కలిసి యజ్ఞాన్ని ప్రారంభించాడు చతుర్ముఖ బ్రహ్మ. ఇంతలో అక్కడికి వచ్చిన సరస్వతి విషయాన్ని గ్రహించి ఆగ్రహంతో త్రిమూర్తులను, ఇతర ప్రధాన దేవతలను నదులుగా మారమని శపించింది. అయితే సరస్వతి ఆగ్రహం వల్ల లోకానికి ఉపకారమే జరిగింది. విష్ణువు కృష్ణా నదిగా, శివుడు వేణీ నదిగా, బ్రహ్మ కోయినా నదిగా మారాడు. భారతావనిలో ప్రసిద్ధి పొందిన ఐదు నదుల్లో కృష్ణానది విషిష్టమైనది, పరమ పవిత్రమైనది. మానవులకు అఖండ పుణ్యాన్ని ప్రసాదించటానికి సహ్యాద్రి పర్వతంలోని బ్రహ్మగిరి శిఖరం నుంచి ఆవిర్భవించిన పరమ పావని కృష్ణానది. తన జన్మస్థానం నుంచి కొంతదూరం ప్రయాణించిన తర్వాత వేణీ నదినీ, కోయినా నదిని ఇతర అనేక ఉపనదులను తనలో కలుపుకొని సుదీర్ఘమైన ప్రవాహ ప్రయాణాన్ని కొనసాగిస్తూ.. శ్రీశైలం మల్లన్న దీవెనలను అందుకుని విజయవాడ వద్ద ఇంద్రకీలాద్రిని సృషించి హంసలదీవి వద్ద సాగరంలో కలుస్తుంది.

కృతయుగంలో ధీరుడు అనే యక్షుడు తన జన్మను సార్ధకం చేసుకుకోవాడానికి జగన్మాత కోసం తపస్సు చేశాడు. ఆ తల్లి అనుగ్రహంతో పర్వతంగా మారాడు. దుర్గమాసురున్ని వధించిన జగన్మాత దుర్గగా కీలాద్రిపై అవతరించింది. అనంతరం మహిసాసురున్ని వధించిన అమ్మవారు కనకప్రబలతో విచ్చేసి కనకదుర్గగా ప్రఖ్యాతిగాంచింది.

1225
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles