పోలీసుపైకి దూసుకెళ్లిన వాహనం.. వీడియో

Wed,March 28, 2018 01:34 PM

Drunk Driver Runs Over Cop Who Tried To Stop Him In Andhra Pradesh

కాకినాడ : మద్యం మత్తులో ఓ డ్రైవర్ తన వాహనాన్ని పోలీసుపైకి పోనిచ్చాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ఆదివారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలకు జరిమానా విధిస్తున్న క్రమంలో తెల్లటి మారుతి కారు దూసుకువచ్చింది. అయితే ఆ కారు డ్రైవర్ మద్యం సేవించి ఉండటంతో తన వాహనాన్ని ఆపలేదు. విషయాన్ని గ్రహించిన పోలీసులు.. కారును ఆపేందుకు ప్రయత్నించారు. నలుగురు పోలీసులు వాహనాన్ని అడ్డుకున్న కూడా అలాగే ముందుకు పోనిచ్చాడు డ్రైవర్. చివరకు ఓ పోలీసు.. బారికేడ్లను కారుకు అడ్డంగా పెట్టబోతుండగా.. అవేమీ పట్టించుకోకుండా కారు వేగాన్ని డ్రైవర్ పెంచాడు. దీంతో కారు కింద పోలీసు పడిపోయాడు. పోలీసుకు గాయాలయ్యాయి. మొత్తానికి మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.2976
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles