వివేకా హత్యపై మాట్లాడొద్దు: హైకోర్టు

Fri,March 29, 2019 10:25 PM

Do not talk about Viveka murder says high court

హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై మీడియా ముందుగానీ, బహిరంగసభల్లో కానీ ఏప్రిల్ 15 వరకు అధికార, ప్రతిపార్టీల నాయకులు ఎవరూ మాట్లాడవద్దని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. వివేకానందరెడ్డి హత్య కేసును సీబీకి అప్పగించాలని దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో శుక్రవారం వాదనలు ముగిశాయి. కేసు విచారణను వచ్చేనెల 15 తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. 15 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబుసహా టీడీపీ నేతలు, ఇటు జగన్‌సహా వైసీపీ నేతలెవరూ హత్యపై మాట్లాడవద్దని ఆదేశించిన ధర్మాసనం.. ఇకపై హత్య గురించి మాట్లాడబోమని కోర్టుకు అంగీకారపత్రం ఇవ్వాలని స్పష్టంచేసింది. సిట్ విచారణను యధావిధిగా కొనసాగించవచ్చని సూచించిన హైకోర్టు.. సిట్ అధికారులెవరు కూడా కేసు వివరాలు వెల్లడించవద్దని ఆదేశించింది.

3008
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles