దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

Mon,September 17, 2018 03:37 PM

dasara holidays from October 9 in Andhra Pradesh

అక్టోబర్ 9 నుంచి సెలవులు
21వ తేదీ వరకూ స్కూళ్ల మూసివేత
18న విజయదశమి


అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అక్టోబర్ 9వ తేదీ మంగళవారం నుంచి 21వ తేదీ ఆదివారం వరకూ సెలవులు ఇస్తున్నట్టు వెల్లడించింది. తిరిగి 22వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించాలని, సెలవు రోజుల్లో స్కూళ్లు నడపరాదని స్పష్టం చేసింది. కాగా, ఈ సంవత్సరం అక్టోబర్ 17న దుర్గాష్టమి, 18న మహర్నవమి, 19న విజయదశమి పర్వదినాలు రానున్నాయి. 21వ తేదీన ఆదివారం రావడంతో, 22న స్కూళ్లు తిరిగి ప్రారంభించాలని ఏపీ సర్కారు జీవో విడుదల చేసింది. దీంతో విద్యార్థులకు మొత్తం 13 రోజుల పాటు సెలవులు రానున్నాయి.

7996
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles