తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్

Mon,May 27, 2019 07:16 AM

cm kcr offers prayers in tirumala srivari temple

తిరుపతి: తిరుమల శ్రీవారిని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారి దర్శనార్దం నిన్న సాయంత్రం తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రికి టీటీడీ అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

ఇవాళ ఉదయం శ్రీవారి ఆలయం మహద్వారం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులకు టీటీడీ ఈవో అనీల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాస రాజు, చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఆలయ వేదపండితులు ఆలయ మర్యదాల ప్రకారం స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ మహాద్వారం గుండా గర్భగుడిలోకి ప్రవేశించిన కేసీఆర్ దంపతులు స్వామి వారి మూల విరాట్టును దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేయగా, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాస రాజులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు, పట్టువస్త్రాలను కేసీఆర్ దంపతులకు అందజేశారు.2831
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles