శ్రీవారి పుష్కరిణిలో వైభవంగా చక్రస్నానం

Fri,September 21, 2018 03:31 PM

chakra snanam in tirumala tirupati devasthanam

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఆలయ పుష్కరిణిలో శ్రీవారి చక్రస్నానం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయం నుంచి శ్రీదేవి, భూదేవి సమేతుడైన మళయప్పస్వామి వారు పుష్కరిణి చెంతకు ఊరేగింపుగా చేరుకున్నారు. ఉత్సవ మూర్తులకు, చక్రతాళ్వారుకు అభిషేకాలు, స్నపన తిరుమంజనం ప్రక్రియను వేడుకగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ, వేలాది భక్తుల గోవిందనామస్మరణలతో చక్రతాళ్వారుకు పుష్కర స్నానం చేయించారు. సాయంత్రం తిరుచ్చి ఉత్సవం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

981
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles