జగన్ కేసులో సీబీఐ వాదనలు పూర్తి

Fri,April 21, 2017 04:12 PM

అక్రమాస్తుల కేసులో నిందితుడు వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న సీబీఐ పిటీషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. నిందితుడు సాక్షులను ప్రభావితం చేస్తున్నాడని సీబీఐ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. మే 15 నుంచి జూన్ 15 మధ్య న్యూజిలాండ్ వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని జగన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వేసవి సెలవుల నిమిత్తం కుటుంబంతో కలిసి వెళ్లాలని జగన్ పిటిషన్‌లో పేర్కొన్నారు. జగన్ పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం తెలిపింది. సీబీఐ వాదనలు విన్న కోర్టు కేసు తీర్పును ఈ నెల 28కి వాయిదా వేసింది.

553

More News