గోదావరిలో మునిగిన బోటు యజమాని అరెస్ట్

Fri,September 20, 2019 07:57 PM

తూర్పుగోదావరి: గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ట టూరిస్టు బోటు యజమాని కోడిగుడ్ల వెంకటరమణను పోలీసులు అరెస్టు చేశారు. వెంకటరమణతో పాటు మరో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ప్రభావతి, అచ్యుతామణి పేరుతో బోటు రిజిస్టేషన్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రంపచోడవరం ఏఎస్పీ వకుల్ జిందాల్ వెంకటరమణను మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. గోదావరిలో బోటు మునిగి 36 మంది మృతి చెందగా, 15 మంది గల్లంతైన సంగతి తెలిసిందే.

668
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles