బల్లకట్టుపై ఉన్న రెండు ఆటోలు, లారీ, ట్రాక్టర్ నీటమునక

Tue,February 5, 2019 03:53 PM

Ballakattu drown in Krishna river while crossing

అమరావతి: కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల వద్ద కృష్ణానదిలో బల్లకట్టు నీటిలో మునిగిపోయింది. గుంటూరు జిల్లా పుట్లగూడెం నుంచి రామన్న పేటవైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బల్లకట్టుపై 20 మంది ప్రయాణికులు ఉన్నారు. స్థానికులు 20 మందిని సురక్షితంగా కాపాడారు. బల్లకట్టుపై ఉన్న రెండు ఆటోలు, లారీ, ట్రాక్టర్ నీటమునిగాయి. ఒడ్డు దగ్గర్లో ప్రమాదం జరగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బల్లకట్టుపై పరిమితికి మించి బరువు వుండటం వల్ల ఈ ప్రమాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

1024
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles