తండ్రి, కుమార్తెపై ముసుగు దొంగల దాడి

Sun,August 18, 2019 07:48 AM

attack on father and daughter in Kurnool district

అమరావతి: ఏపీలోని కర్నూలు జిల్లా దిన్నెదేవరపాడు వద్ద దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. బైక్‌పై వెళ్తున్న తండ్రి, కుమార్తెపై ముసుగు ధరించిన దొంగలు దాడి చేసి దోపిడి చేశారు. తండ్రిని రాడ్లతో కొట్టి కుమార్తె మెడలో బంగారు గొలుసు, బ్యాగు లాక్కెళ్లిపోయారు. గాయపడ్డ తండ్రిని చికిత్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ నుంచి కర్నూలు వచ్చిన కుమార్తెను దిన్నెదేవరపాడుకు తీసుకువెళ్తుండగా దుండగులు దాడి చేశారు.

1050
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles