ఏపీ బడ్జెట్‌..వైఎస్సార్ రైతు భరోసాకు రూ.8750 కోట్లు

Fri,July 12, 2019 01:10 PM

AP minister buggana rajendranath introduces 2019-20 budget


అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తొలిసారిగా 2019-20 బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

బడ్జెట్‌ అంచనా వ్యయం వివరాలు:


బడ్జెట్‌ అంచనా రూ.2,27,974.99 కోట్లు కాగా..రెవెన్యూ వ్యయం రూ.1,80,475.94 కోట్లు అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ తెలిపారు. మూలధనవ్యయం రూ.32,293.39 కోట్లు కాగా..వడ్డీ చెల్లింపుల నిమిత్తం రూ.8,994 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. 2018-19 బడ్జెట్‌తో పోలిస్తే తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో 19.32 శాతం పెరుగుదల ఉన్నట్లు పేర్కొన్నారు. రెవెన్యూ లోటు రూ.1778.52 కోట్లు, ద్రవ్యలోటు సుమారు రూ.35,260.58 కోట్లు జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు సుమారు 3.3 శాతం, జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు సుమారు 0.17 శాతంగా ఉందని తెలిపారు. పట్టణ స్వయం సహాయక బృందాలకు వైఎస్‌ఆర్‌ వడ్డీలేని రుణం కింద రూ.648 కోట్లు కేటాయించగా..ఏపీఎస్‌ఆర్టీసీకి సహాయార్థం రూ.1000 కోట్లు కేటాయించినట్లు మంత్రి బుగ్గన స్పష్టం చేశారు.


రైతు సంక్షేమానికి తొలి ప్రాధాన్యం..


*రైతు సంక్షేమం: ధరల స్థిరీకరణ నిధికి రూ.3వేల కోట్లు
*ప్రకృతి విపత్తుల నివారణ నిధికి రూ.2002 కోట్లు
*రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ కు రూ.4525 కోట్లు
*వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.20,677 కోట్లు
*గ్రామీణాభివృద్ధికి రూ.29,329 కోట్లు
*సాగునీరు, వరద నివారణకు రూ.13,139 కోట్లు
*వైఎస్సార్ రైతు బీమాకు రూ.1163 కోట్లు
*ఆక్వా రైతుల విద్యుత్ సబ్సిడీకి రూ.475 కోట్లు
*రైతుల ఉచిత బోర్లకు రూ.200 కోట్లు

679
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles