చంద్ర‌బాబుకు త‌ల‌నొప్పిగా మారిన సోష‌ల్ మీడియాWed,May 3, 2017 12:29 PM

AP CM Chandrababu unable to face negativeness in social media

త‌నో టెక్నోసావి అని.. టెక్నాల‌జీలో త‌నంత‌ మొన‌గాడే లేడ‌ని... మైక్రోసాఫ్ట్ సీఈఓ స‌త్య నాదేళ్ల‌ ఆ స్థాయికి ఎద‌గ‌డానికి కార‌ణం తానేన‌ని.. అస‌లు టెక్నాల‌జీ అంటేనే తాను అన్నంత బిల్డ‌ప్ ఇస్తున్న ఏపీ సీఎం చంద్ర‌బాబుకు మాత్రం ఇప్పుడు అదే టెక్నాల‌జీ త‌ల‌నొప్పిగా మారింది. పార్టీకి, ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మారిన సోష‌ల్ మీడియాను త‌ట్టుకోలేక‌పోతున్నార‌ట‌. పేస్‌బుక్‌, ట్విట్ట‌ర్‌, వాట్స‌ప్‌ల‌లో వ‌స్తున్న సెటైర్లు, విమ‌ర్శ‌ల‌వ‌ల్ల చంద్ర‌బాబు చాలా ఇబ్బంది ప‌డుతున్నర‌ట‌.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా చంద్ర‌బాబే అంగీక‌రించార‌ట‌. ఈ ప‌రిస్థితిని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాల‌ని పార్టీ నేత‌ల‌కు సూచించిన‌ట్లు స‌మాచారం. ఏపీలో నెటిజ‌న్లు అధికార పార్టీని, ప్ర‌భుత్వాన్ని టార్గెట్ చేస్తున్నార‌ని, దీని వ‌ల్ల ఏది చేసినా పార్టీకి వ్య‌తిరేకంగా ప్ర‌చారం అవుతున్న‌ద‌ని పార్టీ నేత‌ల‌తో చంద్ర‌బాబు ఆందోళ‌న వ్య‌క్తం చేసిన‌ట్లు తెలుస్తున్న‌ది.

పార్టీ నేత‌లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సోష‌ల్ మీడియాపై అవ‌గాహ‌న పెంచుకోవాల‌ని అంద‌రూ ప్ర‌తి రోజూ సోష‌ల్ మీడియాలో ఏం జ‌రుగుతున్న‌దో ఫాలో కావాల‌ని, పార్టీ వ్య‌త‌రేక ప‌చారంపై ఎదురు దాడి చేయాల‌ని సూచించిన‌ట్లు స‌మాచారం. సోష‌ల్ మీడియాలో వ్య‌తిరేకంగా పోస్టులు పెట్టేవారిపై క‌ఠిన చ‌ర్లు తీసుకోవాల‌ని ఏపీ పోలీసుల‌ను ఆదేశించిన విష‌యం తెలిసిందే. సీఎం అదేశాల మేర‌కు కొద్ది రోజుల క్రితం లోకేష్‌కు వ్య‌తిరేకంగా పోస్టు పెట్టిన వ్య‌క్తిని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు.

4495
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS