ఓట్ల లెక్కింపు కోసం 21 వేల మంది సిబ్బంది: ఏపీ సీఈఓ ద్వివేది

Thu,April 25, 2019 06:25 PM

ap ceo gopala krishna dwivedi speaks to media on voting

అమరావతి: ఏపీ సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కౌంటింగ్ కోసం 21 వేల మంది సిబ్బంది అవసరమని ఆయన స్పష్టం చేశారు. అయితే.. ఓట్ల లెక్కింపుకు చివరి నిమిషం వరకు కూడా ఎవరు ఎక్కడ లెక్కింపు ప్రక్రియలో పాల్గొంటారో తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నామని గోపాలకృష్ణ స్పష్టం చేశారు. రెండు సార్లు సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ పరిధిలో చెరో ఐదు పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్‌లను లెక్కిస్తామన్నారు.

ముందుగా పోస్టల్, సర్వీసు ఓటర్ల లెక్కింపు ఉంటుంది. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల కౌంటింగ్‌కు 15 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేస్తాం. టెబుళ్ల పెంపు కోసం వైజాగ్, పశ్చిమ గోదావరి, కర్నూలు జిల్లాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్ సూపర్ వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్స్, ఒక మైక్రో అబ్జర్వర్‌ను నియమిస్తున్నాం. రీపోలింగ్‌కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఆమోదం రావాల్సి ఉందన్నారు.

2080
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles