చంద్రబాబు దుష్ప్రచారానికి దీటైన సమాధానం

Sun,April 14, 2019 07:07 AM

AP ceo dwivedi cast his vote

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఈసీ ఏర్పాట్లు, నిర్వహణపై ఏకపక్షంగా విరుచుకుపడుతున్న చంద్రబాబు, ఆయనవర్గానికి ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది దీటుగా బదులిచ్చారు. గురువారం జరిగిన పోలింగ్‌లో ద్వివేది సాంకేతికలోపంతో ఓటు వేయలేకపోయారంటూ ఎల్లో మీడియాలో చేస్తున్న ప్రచారం సరైందికాదని తెలిసేలా తానూ ఓటేసినట్టు సాక్షాధారాలతో సమాధానమిచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వేదికగా హైడ్రామా కొనసాగిస్తున్న నేపథ్యంలో శనివారం ఎన్నికల సంఘం అధికారులు ఓ వీడియోను విడుదల చేశారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ద్వివేది అటు అసెంబ్లీ, ఇటు లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఓటువేసిన దృశ్యాలు అందులో స్పష్టంగా ఉన్నాయి. ఓటువేసిన అనంతరం ఆయన పోలింగ్ సిబ్బందిని ఏర్పాట్లపై వాకబుచేసిన దృశ్యం కూడా ఉంది.

5927
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles