ఏడుగురు మావోయిస్టులు లొంగుబాటు

Wed,July 24, 2019 01:12 PM

7 Maoists Surrender in Visakhapatnam

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం రూరల్‌ పోలీసుల ఎదుట ఏడుగురు మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ముగ్గురు మహిళా మావోయిస్టులు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల పేర్లు.. లింబో(28), వంతల మంగమ్మ అలియాస్‌ జానకి(34), కిలో రెల్లి అలియాస్‌ దుర్గ(34), వంతల బాబురావు(30), కొరియా శివ(19), కొర్ర సుబ్బాలి అలియాస్‌ అలకనంద(19), బూతూరి నూకరాజు(38). అనారోగ్య కారణాల వల్లనే వీరు లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.

539
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles