కృష్ణా నదిలో నలుగురు విద్యార్థులు గల్లంతు

Wed,August 22, 2018 11:40 AM

4 students drowned in Krishna River in Guntur dist

గుంటూరు : తాడేపల్లి మండలం గుండిమెడ వద్ద విషాదం నెలకొంది. ఇవాళ సెలవు దినం కావడంతో.. కృష్ణా నదిని చూసేందుకు ఏడుగురు విద్యార్థులు వెళ్లారు. సరదాగా నదిలోకి దిగిన నలుగురు విద్యార్థులు.. గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్థులను తాడేకోరు శివ(14), నీలం క్రాంతికుమార్(10), నీలం శశి(8), దినేష్(7)గా గుర్తించారు. మృతదేహాలను నదిలో నుంచి బయటకు వెలికితీశారు పోలీసులు. మృతులను చిర్రావూరు వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతుల నివాసాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

814
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles