బాలిక‌పై అత్యాచారంకేసులో 20 ఏళ్ల జైలు శిక్ష‌

Tue,December 3, 2019 10:25 PM

విజయవాడ: వరుసకు కూతురైన బాలికను చెరపట్టి అత్యాచారం చేసిన మారుతండ్రికి ఇరవై ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ విజ‌య‌వాడ స్పెష‌ల్ కోర్టు సంచ‌ల‌న తీర్పు చెప్పింది. సంఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే...కృష్ణా జిల్లా ఇబ్ర‌హీంప‌ట్నంలో ఓ ఫ్యాక్టరీలో ప‌నిచేసే సైకం కృష్ణారావు అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఇద్దరు బిడ్డల తల్లిపై మనసు పడ్డాడు. తనకు భార్యలేదని.. ఒప్పుకుంటే పెళ్లిచేసుకొంటానని, అప్ప‌టికే ఆమెకు క‌లిగిన ఇద్ద‌రు పిల్లలని కన్నబిడ్డల్లా చూసుకుంటానని న‌మ్మించాడు.


భర్తతో తెగతెంపులు చేసుకొని పిల్లలతో ఇబ్బంది పడుతున్న ఆ వివాహిత కృష్ణారావు మాట‌లు న‌మ్మింది. పదకొండేళ్ళుగా ఇద్దరూ కలిసి కాపురం చేస్తున్నారు. త‌న చేజేతులా చిన్న‌ప్ప‌టినుంచి పెంచి...ప్ర‌స్తుతం పదో తరగతి చదువుతున్న కూతురిపైనే కన్నేశాడు కృష్ణారావు. తల్లి బైటికెళ్లిన సమయంలో పశువులా మారి అత్యాచారం చేశాడు. ఇంటికొచ్చిన తల్లికి జరిగిన ఘోరం చెప్పి కన్నీటిపర్యంతమైంది కూతురు.

త‌ల్లి ఫిర్యాదు మేర‌కు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు వేగంగా దర్యాప్తు చేయడంతో ఏడాది తిరక్కముందే కేసు విచారణకు కొచ్చింది. విజయవాడలోని స్పెషల్ కోర్టు న్యాయమూర్తి కేసును విచారించి కృష్ణారావును దోషిగా తేల్చారు. అతనికి ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష, ఐదువందల జరిమానా విధించారు.

810
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles