జనంపైకి దూసుకెళ్లిన లారీ: 20 మంది మృతి

Fri,April 21, 2017 02:45 PM

చిత్తూరు: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. చిత్తూరు జిల్లాలోని ఏర్పేడులోని పోలీస్‌స్టేషన్ రోడ్డులో దుకాణాలపై లారీ దూసుకెళ్లడంతో 20 మంది మృతి చెందారు. లారీ దూసుకెళ్లే సమయంలో జనం పరుగులు తీశారు. లారీ కరెంట్ స్తంభంను ఢీకొనడంతో ఘటనాస్థలంలో కరెంట్ షాక్‌తో పలువురు మృతి చెందినట్లు సమాచారం. సంఘటన జరిగిన పూతలపట్టు-నాయుడుపేట రహదారిపై రాకపోకలు స్తంభించిపోయాయి. పోలీస్‌స్టేషన్ సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు.

సంఘటన వివరాల్లోకి వెళితే ఇసుక మాఫియాపై ఫిర్యాదు చేయడానికి స్థానిక గ్రామ ప్రజలు ఉదయం రెవెన్యూ అధికారుల వద్దకు వెళ్లారు. వారు పట్టించుకోకపోవడంతో ఫిర్యాదు చేయడానికి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. ఫిర్యాదు దారులతో పోలీస్‌స్టేషన్ ఎస్సై, సీఐ విచారణ జరుపుతుండగానే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పోలీసులు, ఎస్సై, సీఐతో పాటు పలువురు పత్రికా విలేకరులు గాయపడ్డారు. ప్రమదానికి కారణమైన లారీ తిరుపతి నుంచి శ్రీకాలహస్తీకి వెలుతుంది. ఈ ప్రమాదంపై పలు అనుమానాలు తలెత్తున్నాయి. దీని వెనుక ఇసుక మాఫియా హస్తముందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చే్స్తున్నారు.

1260

More News