తిత్లీ తుపాను ధాటికి ఇద్దరు మృతి

Thu,October 11, 2018 11:42 AM

2 persons dies due to Titly cyclone in Srikakulam dist

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తిత్లీ తుపాను ధాటికి ఇద్దరు మృతి చెందారు. వంగర మండలం ఓనిఅగ్రహారంలో చెట్టు విరిగిపడి అప్పల నరసమ్మ(62), సరుబుజ్జిలి మండలంలో ఇల్లరు కూలి సూర్యారావు(55) మృతి చెందారు. మృతుల నివాసాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.

తిత్లీ తుపానుపై కేంద్రం అప్రమత్తం
తిత్లీ తుపానుపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావంపై ఎప్పటికప్పుడు కేంద్ర కేబినెట్ సచివాలయం, హోంమంత్రిత్వ శాఖ వివరాలను తెలుసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ అధికారుల నుంచి కేంద్రం సమాచారం తీసుకుంటోంది. ఆర్మీ, నావికాదళం, కోస్టుగార్డ్, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల నుంచి సమాచారం సేకరిస్తోంది. ప్రాణ నష్టం లేకుండా చర్యలు చేపట్టాలని కేంద్రం.. బృందాలకు ఆదేశాలు జారీ చేసింది. సముద్ర తీర ప్రాంతంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశాలు ఇచ్చింది.

2266
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS