X

జాతీయ గీతాన్ని ఆలపిస్తూ కన్నీరుపెట్టిన హిమదాస్

ఫిన్‌ల్యాండ్: అండర్-20 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 400 మీటర్ల ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలుచుకున్న హిమదాస్.. ఆ మెడల్‌ను అందుకున్న సమయంలో భావోద్వేగానికి లోనైంది. మెడల్ సెర్మనీ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న సమయంలో హిమదాస్ ఆనందభాష్పాలను రాల్చింది. జ‌న‌గ‌ణ‌మ‌న‌ వల్లిస్తూనే ఆమె కన్నీరును ఆపుకోలేకపోయింది. మహాంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహాంద్రా ఆ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేవారు. ఇది మిమ్మల్ని కదిలించకపోతే, ఇక ఏదీ మిమ్మల్ని కదిలించలేదని ఆయన తన ట్యాగ్‌లైన్‌లో పేర్కొన్నారు. ప్రపంచ అథ్లెటిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా హిమదాస్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

Advertising
Advertising